Revanth Reddy On A.I: 200 ఎకరాల విస్తీర్ణంలో AI సిటీ..! 2 d ago
TG : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్ ను భారత AI రాజధానిగా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం మెగా ప్లాన్ గా సీఎం తెలిపారు. దీనిని సాధించడానికి, 200 ఎకరాల విస్తీర్ణంలో AI సిటీని రూపొందించాలని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లను ఆకర్షించగలదని భావిస్తున్న కొత్త సాంకేతికతలకు AI సిటీ కేంద్రంగా ఉండబోతుందని అన్నారు. ఈ నగరం పరిశోధన కేంద్రంగా, స్టార్టప్‌లకు వేదికగా మారుతుందన్నారు. సాధారణంగా, AI సిటీ అంటే టెక్నాలజీ ఆధారిత సిటీ బిల్డింగ్, ఇది నగరాల ప్రతిస్పందనను వారి సాంకేతికతతో మరింత తెలివిగా మార్చే ప్రయత్నం చేస్తామన్నారు.
హైదరాబాద్ లో నిర్మిస్తున్న తొలి ఏఐ సిటీలో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన ఆఫీస్ స్పేస్‌ను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ప్రతిపాదించింది. భవిష్యత్తులో కొన్ని వందల కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. Al సిటీ సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్ మరియు డేటా అనలిటిక్స్‌లో 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్'ని కూడా కలిగి ఉంటుంది. ప్రపంచ స్థాయి క్యాంపైన్‌లు, వాణిజ్య సేవలు, శిక్షణా సౌకర్యాలు, లగ్జరీ హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు, రెసిడెన్షియల్ హోమ్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం AI సిటీలో ఉండబోతున్నాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు.